మనమంతా వినియోగదారులమే అయినప్పటికీ చట్టంలో సూచించిన నిర్వచనం ప్రకారం ఎవరైతే డబ్బు చెల్లించి వస్తువులను సేవలను కొంటారో వారు మాత్రమే వినియోగాదరులవుతారు. అంటే వస్తువులను కొన్నట్లుగా ఆధారం చూపిస్తేనే కోర్టు ఫిర్యాదును స్వీకరిస్తుంది. అందుచేత ప్రతి ఒక్కరూ తప్పని సరిగా బిల్లును భద్రపరచుకోవాలి. చిన్న వ్యాపారులు కూడా వినియోగాదారులే. వీరుకూడా వినియోగదారుల కోర్టులను ఆశ్రయించి పరిహారం పొందడానికి అవకాశం వుంది.
అలాగే వినియోగదారులను మోసంచేసిన లేదా మరేవిధమైన నష్టం కలిగించిన వ్యాపారులపై వినియోగదారులు ఫిర్యాదు చేయవచ్చు. అందుచేత చిన్న వ్యాపారులను వినియోగదారుల చట్టం వారు కొన్న వస్తువులు నాణ్యతలేకపోయనా, నకిలీలు, కల్తీలతో వారు మోసగించబడి నష్టపోయిన సందర్భంలో వారికి కూడా పరిహారం లభించే అవకాశంవుంది.
వినియోగదారుల రక్షణ చట్టంలో పొందుపరచబడిన నిర్వచనం ప్రకారం “ప్రతిఫలం చెల్లించి లేదా చేల్లిస్తాననే వాగ్దానంపై వస్తువులను కొన్నవారుగాని, సేవలను పొందినవారు గాని లేదా అలా కొన్నవారుగాని వారి అనుమతితో ఇతరులు కొన్న వస్తువులను, సేవలను వినియోగించుకునే ఇతరులైనా వినియోగాదారులగా పరిగణి౦చబడతారు. కాని వ్యాపారనిమిత్తం వస్తువులు కొన్నవారుగాని, ఉచితంగా సేవలు పొందేవారుగాని ఈ నిర్వచనం క్రిందకురారు.
కాని చిన్న వ్యాపారులు వారి జీవనోపాధికోసం చేస్తున్న వ్యాపారం చేస్తున్నారుకనుక వారిని కోర్టు వినియోగాదారులగానే పరిగణిస్తుంది. అందుచేత వారు కొనుగోలు వ్యవహారంలో మోసగించబడిన, నష్టానికిగురైనా వినియోగదారుల కోర్టులో ఫిర్యాదు చేయవచ్చు. కాని మోసాలకు పాల్పడే చిన్న వ్యాపారులు, లేదా అక్రమ, అనుచిత వ్యాపార విధానాలకు పాల్పడేవారిని ఈ చట్టం వ్యాపరులుగానే భావించి పరిహారం చెల్లింపచేస్తుంది.